అల .... వైకుంఠపురములో హిందీలోకి

Published on Feb 09,2020 02:57 PM

తెలుగులో సంచలన విజయం సాధించిన '' అల ...... వైకుంఠపురములో '' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో కబీర్ సింగ్ చిత్రాన్ని నిర్మించిన అశ్విన్ వార్డెనే ఈ అల వైకుంఠపురములో చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడు. ఇప్పటికే ఓ రేటు మాట్లాడుకొని హక్కులు సొంతం చేసుకున్నాడట. ఇక ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రాన్ని చేసిన సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి ప్రభంజనం సృష్టించాడు.

దాంతో బాలీవుడ్ లో ఈ దర్శకుడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే మరో బోల్డ్ మోవి తెరకెక్కించే పనిలో పడగా తాజాగా అల వైకుంఠపురములో చిత్రాన్ని కూడా నీవే డైరెక్ట్ చేయాలి అని అంటున్నాడట. ఇక్కడ అంటే తమన్ మ్యూజిక్ , అల్లు అర్జున్ యాక్టింగ్ , త్రివిక్రమ్ డైరెక్షన్ మ్యాజిక్ చేసాయి దానికి తోడు సంక్రాంతి పండగ కలిసి వచ్చింది. మరి హిందీలో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే !