అల .... వైకుంఠపురములో కలెక్షన్స్

Published on Jan 13,2020 04:36 PM

అల్లు అర్జున్ నటించిన అల ...... వైకుంఠపురములో చిత్రానికి హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లు సాధిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అల వైకుంఠపురములో 45 కోట్ల వసూళ్ళని సాధించిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ లభించడంతో బయ్యర్లు అంతా సంతోషంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లు కలిపి మొత్తం మీద 45 కోట్ల భారీ వసూళ్ళని సాధించాడట అల్లు అర్జున్.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషించింది. ఇక మురళీశర్మ నటనకు కూడా జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు. తమన్ అందించిన పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. పాటల కోసమే ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని భావించే వాళ్ళు ఉన్నారంటే తమన్ అందించిన పాటలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మొదటి రోజున భారీ వసూళ్లు రావడంతో ఈ నాలుగు రోజులు కూడా భారీ కలెక్షన్స్ రావడం ఖాయమని భావిస్తున్నారు