వంద కోట్ల క్లబ్ లో కేసరి

Published on Mar 28,2019 10:39 AM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రం వంద కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది . మార్చి 21న రిలీజ్ అయిన కేసరి 5 రోజుల్లోనే 93 కోట్ల వసూళ్ల ని సాధించింది . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో కేసరి మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు . 

అక్షయ్ కుమార్ హీరోగా నటించగా పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించింది . అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించడం విశేషం , ఇక ఈ సినిమా 1897 నాటి సారాగడి యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది . క్రిటిక్స్ నుండి కూడా మంచి రివ్యూస్ సొంతం చేసుకున్న ఈ కేసరి 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం .