శ్రీదేవి - రేఖ లకు అక్కినేని అవార్డు

Published on Nov 18,2019 05:21 PM

అతిలోకసుందరి శ్రీదేవి , మరో అందాల భామ రేఖ లకు అక్కినేని అవార్డు లను అందించారు అక్కినేని కుటుంబం. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తెలుగు సినిమా రంగంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే శ్రీదేవి చనిపోవడంతో ఆమె తరుపున అవార్డు ని అందుకోవడానికి బోనీ కపూర్ హాజరయ్యాడు. ఇక ఈ వేడుకలో అందాల రేఖ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన వాళ్లకు అక్కినేని అవార్డు ని అందిస్తున్నారు. తానూ చనిపోయినా అక్కినేని ఇంటర్నేషనల్  అవార్డు అనేది చిరస్థాయిగా మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాడు అందుకే దానికోసం ఫిక్స్డ్ అమౌంట్ చేసాడు దాంతో ఈ వేడుకని నిర్వహిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఈ వేడుకకు ముఖ్య అథితిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యాడు.