క్రిష్ దర్శకత్వంలో అఖిల్

Published on Feb 02,2019 10:23 AM
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను చిత్రాలు ప్లాప్ కావడంతో ఈసారి చేసే చిత్రం జాగ్రత్తగా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున . అఖిల్ తదుపరి చిత్రానికి సత్య అనే యువ దర్శకుడు వెయిట్ చేస్తున్నాడు కానీ అతడికంటే అనుభవం ఉన్న క్రిష్ అయితే బెటర్ అని భావిస్తున్నాడట నాగార్జున . క్రిష్ ఇప్పటివరకు తీసిన అన్ని చిత్రాలకు విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు కూడా దక్కాయి అందుకే క్రిష్ పట్ల మొగ్గు చూపుతున్నాడట నాగ్ . 

గత నెలలో అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను ఫరవాలేదనిపించింది కానీ మొదటి వారంలో కేవలం 10 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది . ఈ సినిమాని 22 కోట్లకు అమ్మారు . అంటే 22 కోట్ల షేర్ వస్తేనే బయ్యర్లు ఒడ్డున పడతారు లేదంటే నష్టమే ! అయితే ఇప్పుడు సగం మాత్రమే వచ్చింది ఇంకా 12 కోట్లు రావాలి . అది వచ్చే సూచన కనిపించడం లేదు దాంతో క్రిష్ చేతిలో అఖిల్ ని పెట్టాలని చూస్తున్నాడు నాగార్జున . 

నాగార్జున , అఖిల్ , క్రిష్ , ఫిలిం న్యూస్ , మిస్టర్ మజ్ను , nagarjuna , akhil , krish , Mr. majnu , film news