అఖిల్ కొత్త చిత్రం నుండి పాట విడుదల

Published on Mar 02,2020 09:35 PM

అక్కినేని అఖిల్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న '' మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ '' చిత్రం నుండి మనసా ...... మనసా అనే పాట విడుదల అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటగా మనసా ...... మనసా అనే పాటని ఈరోజు విడుదల చేసారు.

బొమ్మరిల్లు భాస్కర్ కు గత కొంత కాలంగా సక్సెస్ లు లేవు దాంతో అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు , హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. కట్ చేస్తే చాలా గ్యాప్ తర్వాత ఈ అవకాశం వచ్చింది. ఇక అఖిల్ కూడా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోగా నటించిన మూడు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు దాంతో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదల అయితే కానీ తెలీదు ఈ ఇద్దరి ఆశలు నెరేవేరుతాయా ? గల్లంతవు తాయా ? అన్నది.