శ్రీను వైట్ల తో అఖిల్ సినిమా చేయడం లేదట

Published on Jan 31,2019 02:19 PM

అక్కినేని అఖిల్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయనున్నట్లు వార్తలు రావడంతో అక్కినేని అభిమానులు భయపడ్డారు . అసలే ప్లాప్ లతో సతమతం అవుతున్న అఖిల్ మరో ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడం ఏంటి ? అని . వెంటనే అఖిల్ ని పెద్ద ఎత్తున సంప్రదించారట అక్కినేని అభిమానులు . ఫ్యాన్స్ ఆందోళన అర్ధం చేసుకున్న అఖిల్ శ్రీను వైట్ల తో సినిమా చేయడం లేదని చెప్పాడట . 

దాంతో ఊపిరి పీల్చుకున్నారు అక్కినేని అభిమానులు . అయితే తాజాగా మిస్టర్ మజ్ను కూడా దెబ్బ కొట్టడంతో తన తదుపరి చిత్రాన్ని సత్య అనే దర్శకుడితో చేయడానికి సిద్ధం అవుతున్నాడట . క్రీడా నేపథ్యంలో సాగే ఈ కథ తుది రూపు దిద్దుకోగానే అధికారికంగా వెల్లడించనున్నారట . అయితే శ్రీను వైట్ల మాత్రం సినిమా లేదు అని తెలిసేసరికి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారట .