హీరో అజిత్ కు గాయాలు

Published on Feb 19,2020 03:03 PM

 స్టార్ హీరో అజిత్ కు షూటింగ్ లో గాయాలు అయ్యాయి. తమిళనాట స్టార్ హీరో అయిన అజిత్ తాజాగా '' వాలిమై '' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది అజిత్ కు 60 వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కోసం భారీ ఎత్తున పోరాట సన్నివేశాలను , ఛేజింగ్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. అజిత్ బైక్ పై వేగంగా వెళ్లే సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో బైక్ అదుపు తప్పడంతో ఒక్కసారిగా అజిత్ కిందపడిపోయాడు. వేగంగా వెళ్తున్న బైక్ నుండి కిందపడటంతో గాయాలు అయ్యాయి.

అయితే అవి పెద్ద గాయాలు కాకపోవడంతో యూనిట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వెంటనే గాయపడిన అజిత్ కు ప్రాధమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేయించుకున్న అజిత్ విశ్రాంతి తీసుకుంటున్నారు. గతంలో కూడా అజిత్ కు షూటింగ్ లో గాయాలయ్యాయి. తరచుగా గాయాలబారిన పడుతుండటంతో అజిత్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.