పుకార్ల ని ఖండించిన అజయ్ దేవ్ గన్

Published on Apr 01,2020 01:52 PM
కాజోల్ ,నైసా లకు కరోనా సోకిందనే పుకార్లని ఖండించాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్. కాజోల్ - అజయ్ దేవ్ గన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ ఇద్దరు సంతానం నైసా , యుగ్ . అయితే అమ్మాయి పెద్దది కావడంతో సింగపూర్ లో ఉన్నత విద్య అభ్యసిస్తోంది. ఇటీవలే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇండియాకు తిరిగి వచ్చింది అజయ్ దేవ్ గన్ కూతురు నైసా. ఆమె సింగపూర్ నుండి వస్తుండటంతో ముంబై ఎయిర్ పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకుంది కాజోల్.

అయితే నైసా కు కరోనా సోకినట్లు దాంతో ఆమె నుండి కాజోల్ కు కూడా కరోనా సోకినట్లు గాసిప్ లు మొదలయ్యాయి. ఈ గాలి వార్తలు అజయ్ దేవ్ గన్ చెవిన పడటంతో ఎట్టకేలకు స్పందించాడు. నా కూతురు నైసా కు కానీ  నా భార్య కాజోల్ కు కానీ ఎలాంటి కరోనా సోకలేదు మేమంతా చాలా సంతోషంగా ఉన్నామంటూ నలుగురు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు అజయ్ దేవ్ గన్. తాజాగా ఈ హీరో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.