లిప్ లాక్ లు చేస్తానంటున్న ఐశ్వర్య రాజేష్

Published on Feb 01,2020 07:21 PM

లిప్ లాక్ సీన్లలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే నా మొదటి సినిమాలోనే 4 లిప్ లాక్ లు ఇచ్చానని అయినా ఇప్పుడు లిప్ లాక్ చాలా కామన్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తెలుగు భామ అయిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. తమిళంలో విజయాలు సాధిస్తూ మంచి రేసులో దూసుకుపోతున్న ఈ భామ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది.

తాజాగా ఈ భామ విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఒక్కతే హీరోయిన్ కాదు ఈ భామతో పాటుగా రాశి ఖన్నా , కేథరిన్ ట్రెసా , ఇసా బెల్లె అనే మరో ముగ్గురు భామలు కూడా నటిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈనెల 14 న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చింది ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలో నాతో పాటుగా మరో ముగ్గురు హీరోయిన్ లు ఉన్నప్పటికీ నా క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉంది కాబట్టే చేశాను అని అంటోంది. ఇక లిప్ లాక్ అనేది కామన్ , కథ డిమాండ్ చేస్తేనే కదా దర్శకులు పెట్టమని చెప్పేది అని గడుసుగా సమాధానం ఇస్తోంది ఐశ్వర్య రాజేష్.