అబ్బూరు ర‌వి నన్ను నిల‌బెట్టారు-అడ‌విశేష్‌

Published on Aug 24,2019 10:54 AM
అడివి శేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ఎవ‌రు`. ఇటీవ‌లె విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. పీవీపీ సినిమా నిర్మించిన చిత్ర‌మిది. వెంక‌ట్ రామ్‌జీ ద‌ర్శ‌కుడు. పెర‌ల్ వి పొట్లూరి, ప‌ర‌మ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచీ మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. 

ఈ సంద‌ర్భంగా...ద‌ర్శ‌కుడు రామ్‌జీ మాట్లాడుతూ... ముందుగా ఈ చిత్రాన్ని ఇంత‌టి విజ‌యం  చేసినందుకు ప్ర‌క్ష‌కాభిమానుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మా ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా ప్ర‌మోట్ చేసేందుకు స‌హాయ‌ప‌డుతున్న వంశీ కాక కి మా కృత‌జ్ఞ‌త‌లు. ఒక సినిమాలో డైరెక్ట‌ర్ చేసిన త‌ప్పులు, కెమెర‌మెన్ స‌రిచేస్తాడు, కెమెర‌మెన్ చేసిన త‌ప్పులు ఎడిట‌ర్ స‌రిచేస్తాడు. ఎడిట‌ర్ చేసిన త‌ప్పులు మ్యూజిక్ డైరెక్ట‌ర్ స‌రిచేస్తాడు ఇలా నేను  ఈ సినిమాలో ఏదైనా త‌ప్పులు చేసిన దాన్ని వీరంద‌రూ క‌వ‌ర్ చేశారు. నాకు ఇది మొద‌టి చిత్రం లాగా అనిపించ‌లేదు. మా చిత్రంలో ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌ని మెచ్చుకుంటున్నారు. ప్ర‌తి ఒక‌ళ్ళు మా సినిమాని ప్రేమించారు. బేసిక్‌గా నాకు పెద్ద‌గా కృష్ణ‌న‌గ‌ర్ క‌ష్టాలేమీ లేవు. చిన్న‌ప్ప‌టి నుంచి మా పేరెంట్స్ నేను ఏది అడిగితే అది చేసేవారు. ముందుగా నేను ఈ ఇండ‌స్ట్రీకి రావ‌డానికి స‌హాయ‌ప‌డ్డ వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. అబ్బుర‌విగారు నేను సినిమామొద‌లు పెట్టిన‌ప్పుడు ఒక మాట అన్నారు. నిన్ను నువు న‌మ్మి చెయి అని. అలాగే నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చి పివిపిగారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.  పివిపి సంస్థ నుంచి ఇంకా ఎంతో మందికొత్త ద‌ర్శ‌కులు రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

అడ‌విశేష్ మాట్లాడుతూ...పివిపిగారి త‌ర‌పున భాను గారు అన్ని ప‌నులు చూసుకున్నారు. నేను క్యాలిఫోర్నియా నుంచి వ‌చ్చినా నాకు కృష్ణాన‌గ‌ర్ క‌ష్టాలు చాలానే ఉన్నాయి.  కాని అవ‌న్నీ క‌నిపించ‌కుండా మెయిన‌టెయిన్ చేసేవాడ్ని. క్యాలిఫోర్నియా నుండి ఇండియా వ‌స్తున్నానంటే అంద‌రూ ఏదో టైం పాస్‌కి అనుకుంటారు.  నాకూ ఎన్నో క‌ష్టాలున్నాయి. మా అమ్మ హోట‌ల్‌లో వెయిట‌ర్‌గా ప‌నిచేసింది. మా నాన్న డాక్ట‌ర్‌. కాని ఆయ‌న చ‌దువును అక్క‌డ వాళ్ళు పెద్ద‌గా తీసుకోలేదు. పెద్ద‌లు ఒక సామెత చెపుతారు స‌ర‌స్వ‌తి ఉన్న చోట ల‌క్ష్మీ ఉండ‌దని. మా ఇంట్లో అదే జ‌రిగింది. నాకు రెస్టారెంట్‌కి వెళ్లి తిన‌డానికి కూడా డ‌బ్బులు ఉండేవి కావు. బ‌ట్ట‌లు కొనుక్కోడానికి కూడా డ‌బ్బ‌లు ఉండేవి కావు చాలా ఇబ్బందులు ప‌డ్డాను. ఒకానొక స‌మ‌యంలో అప్పులు ఇచ్చిన వాళ్ళు పోలీసుల‌ను కూడా పంపించారు. ఢిల్లీలో చుట్టూ లాఠీలు ప‌ట్టుకుని డ‌బ్బులు ఎప్పుడు ఇస్తావ్ అని బెదిరించిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. కిస్ చిత్రం తీసిన త‌ర్వాత చాలా ఇబ్బందులు ప‌డ్డాను. మ‌ళ్ళీ క్ష‌ణం చిత్రంతో కొంచం కోల్కున్నాను. కాని ఎప్పుడు నా వెంట ఉన్న‌ది మాత్రం అబ్బూర‌విగారు మాత్ర‌మే. అబ్బూరిగారే నన్ను నిల‌బెట్టారు. కేవ‌లం స్క్రిప్ట్ కి ఆయ‌న ఇచ్చిన డైలాగ్స్ వ‌ల్లే నేను ఇంత హిట్ అయ్యాను. ఆయ‌నే న‌న్ను నిల‌బెట్టారు. ఈ సినిమా త‌ర్వాత అంద‌రూ న‌న్ను థ్రిల్లింగ్ స్టార్‌, బ‌డ్జెట్ స్టార్ అంటున్నారు. కానీ అవేమీ నాకు ఇంట్ర‌స్ట్ లేదు. నేనేమి అవ‌న్నీ కోరుకోవ‌డంలేదు. నా సినిమా మంచిది అనాలి అంతే చాలు అని అన్నారు.