ఆత్మహత్యకు ప్రయత్నించిన బుల్లితెర నటి

Published on Jan 17,2020 08:29 PM

బుల్లితెర నటి జయశ్రీ ఆత్మాహత్యకు ప్రయత్నించింది. మోతాదుకు మించి నిద్రమాత్రలు తీసుకోవడంతో పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం చెన్నై లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది జయశ్రీ. తమిళనాట టీవీ నటులైన జయశ్రీ - ఈశ్వర్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల పాటువీళ్ళ కాపురం సజావుగానే సాగింది అయితే గత ఏడాది కాలంగా తీవ్ర విబేధాలు వచ్చాయి ఇద్దరిమధ్య దాంతో వేరుగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కూడా.

అయితే తన భర్తకు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది జయశ్రీ ఇక అప్పటి నుండి మరింత దూరం పెరిగింది ఈ ఇద్దరి మధ్య. ఓ పని మీద బయటకు వచ్చిన జయశ్రీ తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో భర్త నుండి ఫోన్ వచ్చిన తర్వాత ఓ మెడికల్ షాప్ ముందు తన కారుని ఆపి నిద్రమాత్రలు తీసుకుంది. అవి మోతాదు మించడంతో జయశ్రీ పక్కన ఉన్న వ్యక్తి ఆమెని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది జయశ్రీ.