మందు తాగితే తప్పేంటన్న నటి

Published on Mar 04,2020 04:02 PM
నేను మందు తాగుతాను , అది హానికరం కావచ్చు కానీ నేరం మాత్రం కాదు కదా ! అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది మలయాళ నటి వీణ నందకుమార్. అబ్బాయిలు బీర్లు తాగుతున్నారు అలాగే నేను కూడా బీర్లు తాగుతాను అందులో తప్పేముంది. ఈ తాగుడు అలవాటు నాకు ఎవరి వల్ల అలవాటు కాలేదు నాకు నేనే నేర్చుకున్నాను. మద్యం తాగితే తప్పులేదు అంటూ కుండబద్దలు కొట్టింది మలయాళ నటి వీణ నందకుమార్.

కెట్టోయ్ లాన్ ఎంటే మాలఖా అనే మలయాళ చిత్రంలో నటించి మంచి హిట్ కొట్టిన వీణ నందకుమార్ కు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సక్సెస్ ఇచ్చిన ఊపులో ఉంది కాబట్టి ఆఫర్లు బాగానే వస్తున్నాయి ఈ భామకు. ఇక మందు గురించి మాట్లాడుతూ నేను తాగుతాను , బహిరంగంగా అందరికీ చెబుతాను నా ఇష్టం అని అంటోంది. అంతేనా అబ్బాయిలు తాగితే తప్పులేదు కానీ అమ్మాయిలం తాగితే తప్పా ? అని ప్రశ్నిస్తోంది.