నటి శ్రీ రెడ్డి పై దాడి

Published on Mar 23,2019 12:25 PM

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పై దాడి జరిగిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది . శ్రీ రెడ్డి పై తమిళ సినీ నిర్మాత , ఫైనాన్సియర్ సుబ్రమణి తో పాటుగా గోపి అనే వ్యక్తి దాడి చేసి గాయపర్చారు , అయితే శ్రీ రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సకాలంలో స్పందించిన పోలీసులు సుబ్రమణి తో పాటుగా గోపి ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు . 

సుబ్రమణి మూడు నెలల క్రితం శ్రీ రెడ్డి పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడట దాంతో కేసు పెట్టడంతో అతడ్ని లోపల వేశారు . జైలు నుండి తిరిగి వచ్చిన సుబ్రమణి కోపంతో శ్రీ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు . ఈ సంఘటనలో శ్రీ రెడ్డి కి స్వల్ప గాయాలు అయ్యాయట దాంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యింది . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి ఇప్పుడు చెన్నై లో ఉంటోంది .