హంపీలో చిక్కుకున్న సీనియర్ నటి జయంతి

Published on Apr 16,2020 06:36 PM
సీనియర్ నటీమణి జయంతి హంపీలో చిక్కుకుంది. కరోనా మహమ్మారితో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ప్రకటనకు ముందు బెంగుళూర్ లో ఉంటున్న జయంతి హంపీలో ఉంటున్న తన కొడుకు దగ్గరకు అని బయలుదేరింది. ఆమె అలా వెళ్లడం ఇలా లాక్ డౌన్ ప్రకటించడంతో హంపీలోని ఓ హోటల్ లో ఉండిపోయింది జయంతి. ఆ హోటల్ నుండి తన కొడుకు దగ్గరకు పోలేక , ఇటు బెంగుళూర్ కు రాలేక సతమతం అవుతోంది.

ఆ హోటల్ లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కన్నా కొడుకుని చూద్దామని వచ్చి ఎటు కాకుండా హోటల్ లో ఉండిపోవాల్సి రావడంతో బాధపడుతోంది. ఇప్పుడేమో లాక్ డౌన్ మరింతగా పొడిగించారు దాంతో పాపం ఆ బాధ ఇంకా ఎక్కువ అయ్యింది ఈ సీనియర్ నటీమణికి. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో నటించింది జయంతి. హీరోయిన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు జయంతి.