Actress Ileyana

Published on Sep 06,2019 11:36 AM

గోవా భామ ఇలియానా భర్త కానీ భర్త ఆండ్రు నీబోన్ ని వదిలేసి రచ్చ రచ్చ చేస్తోంది.ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్  ఆండ్రు తో సహజీవనం చేసిన ఈ భామ రెండేళ్ల పాటు బాగా ఎంజాయ్ చేసింది , ఆండ్రు లేనిదే జీవితం లేదు అన్నట్లుగా వ్యవహరించింది. కట్ చేస్తే ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు నెలకొనడంతో అతడు ఆస్ట్రేలియా చెక్కేసాడు దాంతో ఈ భామ మళ్ళీ ఒంటరి అయ్యింది.
ప్రియుడు వెళ్లిపోవడంతో మళ్ళీ సినిమాల మీదకు గాలి మళ్లినట్లుంది అందుకే తన ఫిజిక్ పై కాస్త దృష్టి పెట్టింది. ఏకంగా చిరంజీవి సరసన నటించాలని ఆశపడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రంలో ఇలియానా ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకేముంది మరోసారి రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది ఇలియానా.