నటికి వేధింపులు

Published on Feb 28,2020 02:58 PM

తమిళ నటి గాయత్రికి ఆకతాయిల నుండి వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించింది. తమిళ నటి అయిన గాయత్రి పిజ్జా ఆర్డర్ ఇవ్వడంతో డోమినోస్ పిజ్జా కు సంబందించిన బాయ్ వచ్చి పిజ్జా ఇచ్చి వెళ్ళిపోయాడట ! అయితే ఆ సమయంలో గాయత్రి మొబైల్ నెంబర్ తెలిసింది కనుక ఆమె సినీ నటి అని తెలుసుకోవడంతో వెంటనే ఆమె నెంబర్ ని అడల్ట్ గ్రూప్ లలో షేర్ చేసాడట ! ఇంకేముంది ఆమె నెంబర్ కు అదేపనిగా అసభ్యకరమైన మెసేజ్ లు , ఫోన్ లు పెద్ద సంఖ్యలో వచ్చాయట.

దాంతో తన నెంబర్ కు కాల్స్ రావడానికి వాట్సాప్ మెసేజ్ లు రావడానికి కారణం పిజ్జా డెలివరీ బాయ్ అని తెలుసుకొని అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిజ్జా డెలివరీ బాయ్ ని అరెస్ట్ చేసారు. అయితే అడల్ట్ గ్రూప్ లలో తన నెంబర్ ఉండటంతో అదేపనిగా ఫోన్లు ఇంకా వస్తూనే ఉన్నాయట ! దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతోంది గాయత్రి.