నటికి మూడేళ్ళ శిక్ష

Published on Nov 01,2019 05:01 PM
మలయాళ నటి సరితా నాయర్ కు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది తమిళనాడు కోర్టు. పవన విధ్యుత్ కుంభకోణంలో మలయాళ నటి సరితా నాయర్ తో పాటుగా ఆమె భర్త బిజూ రాధాకృష్ణన్ , మేనేజర్ రవి లకు కూడా మూడేళ్ళ జైలు శిక్ష విధించింది కోర్టు. మూడేళ్ళ జైలు శిక్ష తో పాటుగా 10 వేల జరిమానా కూడా విధించారు. జరిమానా కట్టని పక్షంలో మరో 9 నెలల జైలు శిక్ష కూడా పడనుంది.

కేరళలో సోలార్ విధ్యుత్ కుంభకోణం అంటూ అప్పట్లో సంచలన కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కుంభకోణంలో సరితా నాయర్ పేరు ప్రముఖంగా వినిపించింది. తమిళనాడులోని కోయంబత్తూర్ , నీలగిరి ప్రాంతాల్లో పవన విద్యుత్ ప్రాజెక్ట్ ల వ్యవహారంలో సరితా నాయర్ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో కోర్టు మూడేళ్ళ శిక్ష విధించింది.