ప్రముఖ నటి కూతురు మృతి

Published on Dec 14,2019 05:12 PM

ప్రముఖ బెంగాలీ , హిందీ నటి మౌసుమీ ఛటర్జీ కూతురు పాయల్ ( 45 ) అనారోగ్యంతో చనిపోయింది. డయాబెటిక్ పేషేంట్ అయిన పాయల్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో మృత్యువాత పడింది. చిన్న వయసులోనే పాయల్ కు చక్కర వ్యాధి రావడంతో అప్పటి నుండి కూడా తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యింది పాయల్. అయితే పాయల్ కు పెళ్లి అయ్యాక ఆమె భర్త పాయల్ ని సరిగ్గా చూసుకోలేదని , అందువల్లే పాయల్ కు ఇంతటి పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తోంది పాయల్ తల్లి సినీ నటి మౌసుమీ ఛటర్జీ.

తన బిడ్డకు సరైన వైద్యం అందించకుండా ఆమె చనిపోయేలా చేసాడని పాయల్ భర్త డిక్కీ పై సంచలన ఆరోపణలు చేస్తోంది పాయల్ తల్లి. 1953 ఏప్రిల్ 26 న కలకత్తా లో జన్మించిన మౌసుమీ ఛటర్జీ కి 14 ఏళ్ల వయసులోనే పెళ్లి అయ్యింది. చిన్న వయసులోనే పెళ్లి కాకుండా చిన్న వయసులోనే తల్లి కూడా అయ్యింది. దాంతో పాయల్ జన్మించింది. మౌసుమీ ఛటర్జీ బెంగాలీ చిత్రాల్లోనే కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటించింది. బెంగాలీ ,హిందీ చిత్రాల్లో స్టార్ డం కూడా అందుకుంది మౌసుమీ ఛటర్జీ.