అసురన్ రీమేక్ లో అభిరామ్ నటించడం లేదట !

Published on Dec 10,2019 02:07 PM

తమిళంలో సంచలన విజయం సాధించిన అసురన్ చిత్రంలో అగ్ర నిర్మాత సురేష్ బాబు  రెండో కొడుకు , రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఈ వార్తలను ఖండించాడు, క్లారిటీ ఇచ్చాడు. అసురన్ రీమేక్ లో వెంకటేష్ మాత్రమే నటిస్తున్నాడని , అంతేకాని అభిరామ్ నటించడం లేదని స్పష్టం చేసాడు.ప్రస్తుతం అభిరామ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడని , అది పూర్తయ్యాక సినిమాల్లోకి వస్తాడని అంతేకాని అసురన్ లో నటించడం లేదని అన్నాడు.

 అయితే యాక్టింగ్ ఎక్కడ నేర్చుకుంటున్నాడు అన్నది మాత్రం చెప్పలేదు సురేష్ బాబు. తాజాగా వెంకటేష్ - నాగచైతన్య కలిసి నటించిన వెంకీ మామ చిత్రం ఈనెల 13 న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సురేష్ బాబు అభిరామ్ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చాడు. వెంకీ మామ చిత్రానికి దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఒక నిర్మాత కావడం విశేషం. ఇక దగ్గుబాటి అభిరామ్ విషయానికి వస్తే ...... శ్రీరెడ్డి వివాదంలో ఫేమస్ అయ్యింది ఈ అభిరామ్ అన్న విషయం తెలిసిందే.