అస‌క్తి రేపుతున్న `ఆవిరి` టీజ‌ర్

Published on Sep 29,2019 10:22 AM
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `ఆవిరి`. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
ఓ ఫ్యామిలీ ఉండే ఇంట్లో ఆత్మ ఉంటే ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయ‌నే కాన్సెప్ట్ మీద ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైల‌ర్‌లో స‌న్నివేశాలు, విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. హార‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో ర‌విబాబు త‌న‌దైన మార్కును క్రియేట్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి హార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ date అనౌన్స్ చేయ‌నున్నారు. 
న‌టీన‌టులు:
ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ఆర్ట్‌:  నారాయ‌ణ రెడ్డి
ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
యాక్ష‌న్‌: స‌తీశ్‌
కెమెరా: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
మ్యూజిక్:  వైధి
స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌
ర‌చ‌న‌, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: ర‌విబాబు