విజయ్ దేవరకొండ పేరుతో ట్రాప్ చేస్తున్న మోసగాడు

Published on Mar 04,2020 04:13 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కున్న ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి పన్నాగం పన్నిన ఓ మోసగాడు ఏకంగా విజయ్ దేవరకొండ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచాడు. దాంతో పెద్ద ఎత్తున అమ్మాయిలు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తుండటంతో వాళ్లతో విజయ్ దేవరకొండ లాగే చాటింగ్ చేస్తూ సహజీవనం చేద్దామని పలువురితో అన్నాడట. మెల్లిగా ఈ విషయం విజయ్ దేవరకొండకు తెలియడంతో అతడ్ని పట్టుకోవడానికి ఓ డ్రామా నడిపించాడు ఈ హీరో.

తన దగ్గరున్న పనిమనిషిని అమ్మాయిలాగా చాటింగ్ చేయించాడు. కట్ చేస్తే అవతలి వ్యక్తి విజయ్ దేవరకొండని నేనే అంటూ చాటింగ్ చేసాడట. దాంతో తన పేరు వాడుకుంటూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వాడి భరతం పట్టాలని భావించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మాయగాడిని పట్టుకునే పనిలో ఉన్నారు.