జాను సినిమా చూస్తూ మృతి చెందిన వ్యక్తి

Published on Feb 08,2020 12:43 PM
శర్వానంద్ - సమంత జంటగా నటించిన జాను చిత్రాన్ని చూస్తూ ఓ అపరిచిత వ్యక్తి మృతి చెందాడు. ఈ సంచలన సంఘటన హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో గల గోకుల్ థియేటర్ లో జరిగింది. నిన్న జాను చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా చూడటానికి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి మ్యాట్నీ సినిమాని చూసాడు. సినిమా అయిపోయాక కూడా కుర్చీ లోంచి లేవకుండా అచేతనంగా అలాగే పడిఉండటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు థియేటర్ యాజమాన్యం.

థియేటర్ కు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో శవాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడా ? లేక మరే కారణం ఏమైనా ఉందా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సినిమాకు ఒక్కడే రావడంతో అతడి పేరు కానీ ఇతర వివరాలు కానీ తెలియడం లేదు.