హీరోలను బూతులు తిట్టిన యువకుడు

Published on Dec 04,2019 02:32 PM

దిశ ని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసిన దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పలువురు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయితే హీరోలు మాత్రం బయటకు రాలేదు సానుభూతి వ్యక్తం చేయలేదు దాంతో ఓ యువకుడు తెలుగు స్టార్ హీరోలను ఒక్కొక్కరి పేర్లు చెబుతూ అమ్మనా బూతులు తిట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సినిమాలలో మీ హీరోయిజం చూపిస్తారు కదా ! మరి దిశా ప అత్యాచారం జరుగుతున్నప్పుడు ఎక్కడున్నార్రా అంటూ బూతుల వర్షం కురిపించాడు ఆ యువకుడు. అయితే అతను అంతగా తిట్టాల్సిన అవసరం లేదు. ప్రశ్నించొచ్చు కానీ బూతులు తిట్టడం మాత్రం తప్పు. ఇతగాడు బూతులు తిడుతుంటే వెనకాలే ఉన్న అమ్మాయిలు భయంతో వెళ్లిపోయారు పాపం.