హీరోయిన్ అమీషా పటేల్ పై కేసు

Published on Mar 30,2019 10:32 AM

బాలీవుడ్ హాట్ భామ అమీషా పటేల్ పై కేసు నమోదయ్యింది . ఓ ఫైనాన్సియర్ దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు అడిగినందుకు బెదిరిస్తుండటంతో ఆ ఫైనాన్సియర్ పోలీసులను ఆశ్రయించాడు . సంఘటన వివరాలలోకి వెళితే ...... చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న అమీషా పటేల్ మరో నిర్మాతతో కలిసి సినిమా నిర్మాణానికి ఫైనాన్షియర్ అజయ్ కుమార్ దగ్గర 2 కోట్ల 50 లక్షలు అప్పుగా తీసుకున్నారు . 

అయితే ఇంతకీ ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో గట్టిగా అడిగేసరికి చెక్ లు ఇచ్చారు . ఆ చెక్ లు బౌన్స్ కావడంతో మళ్ళీ నిలదీశాడట సదరు ఫైనాన్షియర్ ఇంకేముంది నాకు ఫలానా వాళ్ళు తెలుసు అంటూ వాళ్ళ ఫోటోలను చూపిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిందట అమీషా పటేల్ దాంతో భయపడిపోయిన అజయ్ కుమార్ కేసు పెట్టాడు . అమీషా పై చీటింగ్ కేసు తో పాటుగా చెక్ బౌన్స్ కేసు కూడా నమోదయ్యింది.