90 ఎం ఎల్ ట్రైలర్ ఎలా ఉందంటే

Published on Nov 21,2019 02:06 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన కార్తికేయ తాజాగా నటిస్తున్న 90 ఎం ఎల్ చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. కార్తికేయ - నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్ కీలక పాత్ర పోషించాడు. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 5 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంతో ఈరోజు ట్రైలర్ ని విడుదల చేసారు.

ఈ ట్రైలర్ యూత్ ని అలరించేలా ఉంది. 90 ఎం ఎల్ నేపథ్యం చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతూ ఉంటుంది. హీరోకు చిన్నప్పటి నుండే 90 ఎం ఎల్ తాగించాలి లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పడం కొసమెరుపు. మొత్తానికి విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం పై అంచనాలు పెరిగేలా కనబడుతున్నాయి. కార్తికేయ గత చిత్రాలు అంతగా ఆడలేదు కానీ ఈ 90 ఎం ఎల్ మాత్రం యూత్ ని అలరించేలా కనబడుతోంది. ఈ చిత్రానికి చాలా రోజుల తర్వాత అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.