డిసెంబర్ 5 న 90 ఎం ఎల్ విడుదల

Published on Nov 12,2019 05:46 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకున్న యంగ్ హీరో కార్తికేయ తాజాగా '' 90 ఎం ఎల్ '' అనే చిత్రంలో నటిస్తున్నాడు.శేఖర్ రెడ్డి అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు హీరో కార్తికేయ. 90 ఎం ఎల్ ఫస్ట్ లుక్ , టీజర్ అంతా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మద్యం అలవాటు ఉన్నవాళ్లకు 90 ఎం ఎల్ అనేది త్వరగా కనెక్ట్ అవుతోంది దాంతో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది.

ఇక కార్తికేయ నటించిన 90 ఎం ఎల్ చిత్రాన్ని డిసెంబర్ 5 న విడుదల కానుండగా ఈ సినిమా హిట్ అవుతుందా ? కార్తికేయ కు హిట్ ఇస్తుందా ? లేదా ? అన్న టెన్షన్ నెలకొంది ఆ చిత్ర యూనిట్ లో. ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ హీరో నటించిన హిప్పీ డిజాస్టర్ అయ్యింది , గుణ 369 కూడా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. విలన్ గా నటించిన గ్యాంగ్ లీడర్ కూడా అంతే ! దాంతో 90 ఎం ఎల్ అందించే కిక్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు కార్తికేయ.