90 ఎం ఎల్ ఫస్టాఫ్ రిపోర్ట్

Published on Dec 06,2019 12:21 PM

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ గుమ్మకొండ తాజాగా నటించిన 90 ఎం ఎల్ ఈరోజు విడుదల అయ్యింది. ఇప్పుడే ఫస్టాఫ్ అయిపోయింది, ఫస్టాఫ్ విషయానికి వస్తే సినిమా ఆసక్తికరంగానే సాగింది. 90 ఎం ఎల్ తాగకపోతే జీవితం కోల్పోయే బాధితుడిగా నటించాడు కార్తికేయ. 90 ఎం ఎల్ పెగ్ వేస్తేనే హీరో ఆరోగ్యాంగా ఉంటాడని లేకపోతే కిందపడిపోయే క్యారెక్టర్ లో కార్తికేయ బాగానే నటించాడు. ఇక ఈ తతంగంలో ఎంటర్ టైన్ మెంట్ బాగానే వర్కౌట్ అయ్యింది.

ఇదే విధంగా రెండో భాగం కూడా ఉంటే తప్పకుండా కార్తికేయ హిట్ కొట్టే అవకాశం ఉంది , లేకపోతే ప్లాప్ మూటగట్టుకుని అవకాశం ఉంటుంది. ఇక సెకండాఫ్ కూడా బాగానే ఉంటుందా ? లేదా ? అన్నది చూడాలి. కార్తికేయ ఆర్ ఎక్స్ 100 తో సూపర్ హిట్ కొట్టాడు అయితే దాని తర్వాత మాత్రం వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడ్డాడు. మరి ఈ 90 ఎం ఎల్ కార్తికేయ కు హిట్ నిస్తుందా ?