మిస్టర్ మజ్ను వల్ల 9 కోట్ల నష్టం

Published on Feb 05,2019 12:41 PM

అక్కినేని అఖిల్ - నిధి అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' మిస్టర్ మజ్ను '' . జనవరి 25 న విడుదలైన ఈ చిత్రం బయ్యర్లకు 9 కోట్ల నష్టాన్ని మిగిల్చింది . ఈ సినిమా ఇప్పటివరకు 11 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది . ఈ సినిమాని అన్ని ఏరియాల వారీగా 20 కోట్ల బిజినెస్ జరిగింది . అంటే బయ్యర్లకు 20 కోట్లకు పైగా షేర్ రావాలి కానీ ఈ మిస్టర్ మజ్ను 11 కోట్లు మాత్రమే రాబట్టాడు . 

అఖిల్ సోలో హీరోగా నటించిన మూడు చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి . మిస్టర్ మజ్ను కొంతలో కొంత బెటర్ అని అనుకున్నారు పైగా మజ్ను టైటిల్స్ తో వచ్చిన చిత్రాలు అక్కినేని ఫ్యామిలీ కి కలిసి వచ్చాయి కానీ అఖిల్ కు మాత్రం ఆ సెంటిమెంట్ కలిసి రాలేదు దాంతో మూడో సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది .