7 కోట్ల షేర్ సాధించిన వెంకీమామ

Published on Dec 14,2019 11:52 AM

డిసెంబర్ 13 న విడుదలైన వెంకీ మామ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి దాంతో మొదటి రోజునే 7 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. వెంకటేష్ - నాగచైతన్య కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రానికి మొదటి నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి దాంతో ఈ సినిమా మంచి వసూళ్ల ని సాధించింది. సినిమాకు హిట్ టాక్ కూడా రావడంతో ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈరోజు , రేపు కూడా మరిన్ని మెరుగైన కలెక్షన్స్ రావడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ నటించగా నాగచైతన్య - రాశి జంటగా నటించారు. కె ఎస్ రవీంద్ర ( బాబీ ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు - విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. వెంకటేష్ పుట్టినరోజున విడుదలైన ఈ చిత్రానికి భారీ విజయం లభించడంతో వెంకీ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే వెంకటేష్ కూడా భావోద్వేగానికి కూడా లోనయ్యాడు.

వెంకీ మామ మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం                           -  2. 29 కోట్లు
సీడెడ్                            - 1. 60 కోట్లు
కృష్ణా                              - 37 లక్షలు
గుంటూరు                       - 72 లక్షలు
ఈస్ట్                                -  60 లక్షలు
వెస్ట్                                 - 30 లక్షలు
నెల్లూరు                          - 27 లక్షలు
ఉత్తరాంధ్ర                      -  87 లక్షలు

మొత్తం                            -  7. 02 కోట్ల షేర్