ఆత్మహత్యకు ప్రయత్నించిన 30 ఇయర్స్ పృథ్వీ

Published on Mar 10,2020 07:50 PM

తీవ్ర అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడట 30 ఇయర్స్ పృథ్వీ. అయితే సమయానికి మెగాస్టార్ చిరంజీవి పృథ్వీ కి ధైర్యం నూరి పోశారట దాంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడట అందుకే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తనకు దేవుడితో సమానమని అంటున్నాడు పృథ్వీ. కమెడియన్ గా తెలుగునాట సంచలనం సృష్టించిన పృథ్వీ ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. అలాగే ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జగన్ కు మద్దతిగా నిలిచాడు.

ఏపీ లో వై ఎస్సార్ కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పృథ్వీ కి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ పదవిలో కనీసం ఆరు నెలలు కూడా ఉండకుండానే రాజీనామా చేసాడు. నాపై కొంతమంది కావాలనే కుట్ర చేసారని దాని వల్లే నేను రేప్ చేయబడ్డానని అంటున్నాడు. కుట్రలో బలైపోయానని అయితే నాకు ధైర్యం నూరి పోసింది మాత్రం అన్నయ్య  చిరంజీవి అని అంటున్నాడు పృథ్వీ. చిరంజీవి తాజాగా నటిస్తున్న ఆచార్య చిత్రంలో పృథ్వీ కి ఛాన్స్ ఇచ్చాడు.