3 చిత్రాల విడుదల !

Published on Nov 16,2019 01:33 AM

 3 చిత్రాలు విడుదల . అందులో విశాల్ నటించిన '' యాక్షన్ '' , '' విజయ్ సేతుపతి '' అనే చిత్రం అలాగే సందీప్ కిషన్ నటించిన '' తెనాలి రామకృష్ణ బి ఏ బిఎల్ '' చిత్రాలు ఉన్నాయి. విశాల్ - తమన్నా జంటగా నటించిన యాక్షన్ చిత్రం ట్రైలర్ తో ఆకట్టుకుంది. టైటిల్ కు తగ్గట్లే విశాల్ తో పాటుగా తమన్నా కూడా యాక్షన్ సీన్స్ లో మెప్పించింది ట్రైలర్ లో. మరి సినిమా ఎలా ఉంటుందో అన్నది మాత్రం తెలియనుంది.

ఇక సందీప్ కిషన్ -హన్సిక నటించిన తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ చిత్రానికి వినోదాత్మక చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించాడు దానికి తోడు ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక సందీప్ కిషన్ కూడా ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడు. వీటితో పాటుగా విజయ్ సేతుపతి అనే చిత్రం కూడా వస్తోంది. మరి ఈ మూడు చిత్రాల్లో విజయం సాధించేది ఏదో ?