మహేష్ , ప్రభాస్ లను పక్కకు నెట్టేసిన విజయ్ దేవరకొండ

Published on Mar 15,2019 10:08 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు , తాజాగా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో విజయ్ దేవరకొండ 2018 మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నెంబర్ స్థానాన్ని ఆక్రమించాడు . ఇదే సర్వేలో స్టార్ హీరోలైన మహేష్ బాబు , ప్రభాస్ , ఎన్టీఆర్ , చరణ్ తదితర హీరోలు ఎక్కడో వెనకాల పడ్డారు పాపం . ఈ హీరోకు ఇంతగా క్రేజ్ రావడానికి కారణం గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలు . 

గత ఏడాది విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం , నోటా , టాక్సీవాలా చిత్రాలు రిలీజ్ కాగా గీత గోవిందం సంచలన విజయం సాధించింది , అలాగే టాక్సీవాలా కూడా హిట్ అయ్యింది దాంతో ఈ హీరో క్రేజ్ అమాంతం పెరిగింది . తాజాగా ఈ హీరో డియర్ కామ్రేడ్ , క్రాంతిమాధవ్ చిత్రాల్లో నటిస్తున్నాడు . ఇక వచ్చే నెలలో కొత్త సినిమాని ప్రారంభించనున్నాడు .