3 రోజుల్లోనే 19 కోట్లు రాబట్టిన భీష్మ

Published on Feb 24,2020 09:14 PM

3 రోజుల్లోనే 19 కోట్ల షేర్ రాబట్టాడు భీష్మ. ఫిబ్రవరి 21 న విడుదలైన భీష్మ చిత్రానికి మొదటి రోజునే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా సాగడంతో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. దాంతో మూడు రోజుల్లోనే 18 కోట్ల 89 లక్షల షేర్ సాధించింది భీష్మ చిత్రం. వెంకీ కుడుముల దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించింది.

వెంకీ కుడుములకు ఇది రెండో సినిమా కావడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా రెండో గండాన్ని అధిగమించాడని ప్రశంసల వర్షం కురుస్తోంది అతడిపై. ఛలో తర్వాత కొంత గ్యాప్ తీసుకొని చేసిన ఈ భీష్మ కూడా సక్సెస్ కావడంతో వెంకీ కి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక నితిన్ కూడా భీష్మ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాడు. గతకొంత కాలంగా నితిన్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు కట్ చేస్తే భీష్మ దానికి బ్రేక్ వేసింది. 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 19 కోట్ల కలెక్షన్స్ రావడంతో బయ్యర్లు అందరూ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.