100 మిలియన్ వ్యూస్ సాధించిన అల్లు అర్జున్

Published on Dec 01,2019 01:59 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామజవరగమన అనే పాటతో యూట్యూబ్ లో సరికొత్త సంచలనం సృష్టించాడు. తాజాగా ఈ హీరో '' అల ...... వైకుంఠపురములో '' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల కాగా అందులో రెండు పాటలు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి.

అయితే ఈ చిత్రం నుండి మొదట విడుదలైన పాట '' సామజవరగమన '' . ఈ పాట అలా విడుదల అవ్వడమే ఆలస్యం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ వచ్చింది. తాజాగా 100 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. తెలుగులో 100 మిలియన్ వ్యూస్ సాధించిన మొట్ట మొదటి పాటగా చరిత్ర సృష్టించింది సామజవరగమన. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.