ఆర్ ఆర్ ఆర్ లో రెండు ఫైట్ల కోసం 100 కోట్ల ఖర్చు

Published on Jan 15,2020 06:07 PM
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కేవలం 2 ఫైట్ల కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇప్పటికే ఆ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు. ఇక రెండు ఫైట్లలో ఒకటేమో ఎన్టీఆర్ పైన మరొక ఫైట్ చరణ్ పైన చిత్రీకరించారు జక్కన్న. బ్రిటిష్ సైనికులతో అరివీర భయంకరంగా పోరాడే సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరించారట జక్కన్న. ఎన్టీఆర్ , చరణ్ లు వేరు వేరుగా పోరాడిన సన్నివేశాలు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయట.

కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేసారని , ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. అలాగే చరణ్ కూడా అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుత అభినయం ప్రదర్శించారని కొనియాడుతున్నారు యూనిట్ సభ్యులు. ఒలీవియా మోరీస్ , అలియా భట్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై 30 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.