విజయ్ దేవరకొండతో 100 కోట్ల డీల్

Published on Mar 06,2020 06:01 PM
విజయ్ దేవరకొండతో 100 కోట్ల డీల్

బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ విజయ్ దేవరకొండతో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో క్రేజీ హీరో అయిన విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ ఉంది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఈ క్రేజ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ దాంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి కరణ్ జోహార్ 100 కోట్లతో డీల్ చేసుకున్నాడట. వరుసగా కరణ్ జోహార్ తో సినిమాలు చేయడానికి ఈ ఒప్పందమట.

తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. ఫైటర్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఆ సినిమా కనుక హిట్ అయితే కరణ్ జోహార్ పంట పండినట్లే ! ఎందుకంటే హిందీలోనే కాకుండా తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో కూడా ఆయా చిత్రాలను విడుదల చేయనున్నాడు కరణ్ జోహార్. అయితే విజయ్ కి క్రేజ్ బాగానే ఉంది కానీ ఈమధ్య నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి పాపం .