సుకుమార్ ని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు

Published on Mar 05,2019 03:45 PM

రంగస్థలం  వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు సుకుమార్ . మహేష్ బాబు కూడా సుకుమార్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు కూడా అయితే సుకుమార్ చెప్పిన అన్ని కథలు కూడా మహేష్ కు నచ్చలేదు దాంతో సినిమా చేయనని చెప్పేసాడు మహేష్ . దాంతో ఖంగుతిన్నాడట దర్శకులు సుకుమార్ . 

మహేష్ బాబు తప్పకుండా ఒప్పుకుంటాడని ఆశించాడట కానీ రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇంతటి అవమానం ఏంటి ? అని బాధపడుతున్నాడట సుకుమార్ . ఇంతకుముందు మహేష్ బాబు - సుకుమార్ ల కాంబినేషన్ లో 1 నేనొక్కడినే అనే చిత్రం వచ్చింది అయితే అది డిజాస్టర్ అయ్యింది దాంతో మహేష్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట . మహేష్ రిజెక్ట్ చేయడంతో  అదే కథతో అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సుకుమార్ .